టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, దగ్గుబాటి హీరో రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. అభిరామ్  తమ బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ప్రత్యూష అభిరామ్ కి మరదలు వరుస అవుతుంది. వారి స్వస్థలం కారంచేడు. ఒకప్పటి అగ్ర నిర్మాత, సురేష్ బాబు తండ్రి రామానాయుడు స్వగ్రామం కూడా కారంచేడు కావడం విశేషం. వీరి బంధువుల అమ్మాయే ప్రత్యుష.  ఈ పెళ్లి వేడుక శ్రీలంకలో జరగడం విశేషం. ప్రత్యూష అనే అమ్మాయిని అభిరామ్ వివాహం చేసుకున్నాడు. శ్రీలంకలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి దగ్గుబాటి కుటుంబ సభ్యులు, బంధువులు,

 సన్నిహితులు హాజరయ్యారు. శ్రీలంకలోని కలుతర పట్టణంలో ఉన్న అనంతర కలుతర లగ్జరీ రిసార్ట్స్‌లో ప్రత్యూష మెడలో అభిరామ్ మూడుముళ్లు వేశారు. సముద్రం మధ్యలో ఉండే ఈ లగ్జరీ రిసార్ట్స్‌లో అభిరామ్, ప్రత్యూషల పెళ్లి వేడుక జరగడం విశేషం ఇది పెళ్లికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిరామ్ పెళ్లి కోసం దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు బంధువులు, స్నేహితులు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీలంక వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రానా, అభిరామ్, సురేష్ బాబు,నాగ చైతన్య తదితరులు

 కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శుక్రవారం దగ్గుబాటి కుటుంబ సభ్యులు శ్రీలంక నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. ఈ మేరకు నూతన వధూవరులు అభిరామ్, ప్రత్యూష హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించిన వీడియోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు చూసిన దగ్గుబాటి ఫ్యాన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీలంకలో పెళ్లి వేడుకను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ మరో రెండు రోజుల్లో ఘనంగా రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు వ్యాపారవేత్తలు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: