న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న రెగ్యులర్ సాంప్రదాయానికి భిన్నంగా గురువారమే రిలీజ్ అవ్వడం ఈ మూవీకి ప్లస్ అవుతుంది. ఫస్ట్ డే కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ క్రమక్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతుండడంతో థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి వీకెండ్ మూడు రోజులు రావడం మరింత ప్లస్ అని చెప్పొచ్చు. నిజానికి డే వన్ హాయ్ నాన్నకి బెస్ట్ ఓపెనింగ్స్ రాలేదు. కేవలం10 కోట్లకు పైగా గ్రాస్ మాత్రమే వచ్చింది. 

నాని కున్న మార్కెట్ కి ఇదేం పెద్ద హైయెస్ట్ గ్రాస్ కాదు. సినిమా మొత్తం ఎమోషనల్ జోనర్ కాబట్టి మాస్ ఆడియన్స్ లో ఆదరణ పెద్దగా ఉండదు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తోనే సినిమా గట్టెక్కాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. సినిమా రెస్పాన్స్ కు తగ్గట్లు థియేటర్స్ లేవని ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఉదాహరణకి హైదరాబాద్ తీసుకుంటే హాయ్ నాన్న కంటే యానిమల్ హిందీ, తెలుగు వర్షన్స్ కే ఎక్కువ షోలు వేయడం గమనార్హం. హాయ్ నాన్నకు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 80% ఆక్యుపెన్సి కనిపిస్తోంది. దానికి అనుగుణంగా మల్టీప్లెక్స్ లోను స్క్రీన్స్ పెంచాలి. 

కానీ పబ్లిక్ డిమాండ్ పేరుతో యానిమల్ కి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడం సరికాదనేది ఫ్యాన్స్ చెబుతున్న మాట. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కాబట్టి అటు ఏపీ లోను ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లు సినిమా బుకింగ్స్ చెబుతున్నాయి. ఇక ఈ వీకెండ్ హాయ్ నాన్నకు ఎంతో కీలకము. ఎందుకంటే వచ్చేవారం ఎంత ఖాళీగా ఉన్నా సరే సలార్, డంకీల కోసం ఉన్న క్యూరియాసిటీ వల్ల హాయ్ నాన్నకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ఉండకపోవచ్చు. అందుకే ఈ వీకెండ్ లోని వీలైనంత రాబట్టుకోవడం కీలకం. ఓవర్సీస్ లో మొదటి రోజే హాఫ్ మిలియన్ మార్క్ అందుకున్న హాయ్ నాన్న మూవీకి నాని అక్కడే ఉండి ప్రమోషన్స్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది. అక్కడ టూర్ పూర్తి చేసుకుని వచ్చాక ఇక్కడి ఆడియన్స్ ని కలిసేందుకు నాని ప్లాన్ చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: