'హాయ్ నాన్న  మూవీ తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'అంటే సుందరానికి' ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోకపోవడంతో ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఈ మూవీలో నానిని వివేక్ ఆత్రేయ కంప్లీట్ మాస్ యాక్షన్ అవతార్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు. కొద్దిరోజుల క్రితమే అన్ చైల్డ్ వీడియోని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై నాని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా అమెరికా వెళ్ళిన నాని అక్కడి వాళ్లతో మాట్లాడుతూ, ' సరిపోదా శనివారం మూవీని వచ్చే ఏడాది ఆగస్టు నెలలో రిలీజ్ కి రెడీ చేస్తున్నట్లు' చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే ఏడాది ఆగస్టు 15న 'పుష్ప 2' రిలీజ్ కాబోతోంది. పుష్ప 2 రిలీజైన రెండు వారాలకి నాని 'సరిపోదా శనివారం' మూవీని విడుదల చేసేందుకు మూవీని ప్లాన్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లోనూ టాక్ వినిపిస్తోంది. 

అయితే మూవీ టీం రిలీజ్ డేట్ ని ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో నాని రగుడ్ లుక్ లో కనిపించనున్నాడు. నాని సరసన మలయాళ బ్యూటీ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి 'సరిపోదా శనివారం' లో జతకట్టారు. కోలీవుడ్ అగ్ర నటుడు SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఏడాది 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాని తాజాగా 'హాయ్ నాన్న' తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత నాని నటిస్తున్న డిఫరెంట్ యాక్షన్ జోనర్ మూవీ 'సరిపోదా శనివారం'. 


మరింత సమాచారం తెలుసుకోండి: