టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నాని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం హాయ్ నాన్న.. ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. డిసెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో ఏ సినిమా విడుదల అయింది. తాజాగా యూఎస్ఏ లో మిలియన్ డాలర్లు రాబట్టిన మూవీ జాబితాలలో ఈ సినిమా కూడా నిలవడం జరిగింది. ఈ సినిమా నాని కెరియర్ లోని తొమ్మిదవ సినిమాకు యూఎస్ఏ లో నిలవడం గమనార్హం.


Usa లో బాక్సాఫీస్ వద్ద దక్షిణాది సినిమాల హీరోల సినిమాలను అక్కడ కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ ఉంటారు. దీంతో దక్షిణాది సినీ ప్రవేశం కు చెందిన సినిమాలలో అత్యధిక సార్లు మిలియన్ డాలర్లను అందుకున్న విషయానికి వస్తే.. తమ అభిమాన హీరోల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు యూఎస్ఏ లో అత్యధికంగా సార్లు మిలియన్ డాలర్లను మార్క్ చేరుకున్న రికార్డును అందుకున్న హీరోలలో మహేష్ బాబు పేరు మీద దాదాపుగా 11 సినిమాలు పైగా అక్కడ భారీ వసూలను రాబట్టాయి.

ఆ తర్వాత స్థానంలో హీరో నాని 9 సినిమాలతో నిలిచారు ఆ తర్వాత స్థానం సూపర్ స్టార్ రజనీకాంత్ ఎనిమిది సినిమాలతో మూడవ స్థానంలో నిలువగా పవన్ కళ్యాణ్ -7, ఎన్టీఆర్ -7, అల్లు అర్జున్-5, ప్రభాస్,-5, బాలకృష్ణ -4, చిరంజీవి -4, రాంచరణ్ 3 తదితర హీరోలు సైతం 2 సార్లు అత్యధికంగా మిలియన్ డాలర్లను అందుకున్నారు. మిగిలిన వారంతా కూడా కేవలం ఒక్కొక్క సినిమాతోనే యూఎస్ఏ లో మిలియన్ డాలర్లు మారుకొని అందుకున్నారు. మన తెలుగు సినిమాలతో సహా దక్షిణాది సినిమాలన్నీ కూడా భారీ స్థాయిలో పోటీపడుతున్నాయి. దీంతో 1000 కోట్ల మార్కెట్తో ప్రస్తుతం డైరెక్టర్లు సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA