యానిమల్ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు మారుమోగుతోంది అని చెప్పాలి. సినిమా అంటే ఇలాగే తీయాలి అనేటట్లుగా ఈ సినిమాను తెరకెక్కించి విమర్శలతో పాటు ప్రశంసలను సైతం అందుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమా ద్వారా సందీప్ రెడ్డివంగా బాగానే కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి కేవలం 1.5 కోట్ల కోసం 36 ఎకరాల మామిడి తోటను అమ్ముకున్నాడు సందీప్ రెడ్డి వంగా. కానీ ఇప్పుడు యానిమల్ సినిమా ద్వారా ఏకంగా 200 కోట్లను వెనకేసుకున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం

 సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. యానిమల్ సినిమాని డైరెక్ట్ చేయడంతో పాటు ఆయన సొంత ప్రొడక్షన్ భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ తో కలిసి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. దాంతో ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. దాంతో వందల కోట్లల్లో లాభాన్ని పొందాడు సందీప్ రెడ్డి వంగ. ఇదిలా ఉంటే ఇక ధైర్యంగా ముందడుగు వేసిన వాళ్ళకి అదృష్టం కూడా వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. అయితే గతంలో ఆయన మొదటి సినిమా ఆయన అర్జున్ రెడ్డి సినిమాని తీయడానికి ఎవరు కూడా ముందుకు

 రాకపోవడంతో తమ పూర్వీకుల భూమిని అమ్మ వలసి వచ్చింది అంటూ గతంలో ఆయన స్వయంగా చెప్పారు. ఇక ఆ సినిమా కోసం తన దగ్గర 1.5 కోట్లు ఉన్నాయని మిగతా మొత్తం కోసం చాలామంది ముందుకు వచ్చినా కూడా చివరి నిమిషంలో వెనుకడుగు వేశారు అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు సందీప్. కానీ ఇప్పుడు యానిమల్ మూవీని  రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇందులో టీ సిరీస్ తోపాటు సందీప్ సొంత ప్రొడక్షన్ హౌజ్ భద్రకాళీ పిక్చర్స్ కూడా ఉంది. ఈ సినిమా 10 రోజుల్లోనే రూ.660 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ లాభాలు, డైరెక్టర్ గా సందీప్ రెమ్యునరేషన్ అంతా కలుపుకుంటే ఇప్పటికే అతడు, అతని సోదరు ప్రణయ్ రెడ్డి ఈ సినిమా ద్వారా రూ.200 కోట్ల వరకూ సంపాదించినట్లు సమాచారం...!

మరింత సమాచారం తెలుసుకోండి: