ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మూవీలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా రన్ టైమ్ కాస్త ఎక్కువగానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. గతంలో ఈయన తెరకెక్కించిన కే జి ఎఫ్-2 సినిమా కూడా రెండు గంటల 48 నిమిషాలు ఉన్నది.. ప్రస్తుతం సలార్ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే 2 :55 నిమిషాల22 సెకండ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఈ చిత్రానికి గాని CBFC A సర్టిఫికెట్ ను సైతం ఇవ్వడం జరిగింది.

ఈ యాక్షన్ సినిమా కాస్త హింసకు ఎక్కువగానే ఉన్నట్లు ఈ ట్రైలర్లు చూపించారు.. అందుచేతనే సలార్ సినిమా కి అడల్ట్ సర్టిఫికెట్ను సైతం ఇవ్వడం జరిగింది అంటు ..దాదాపుగా 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే ఈ చిత్రాన్ని థియేటర్లో చూడవలసి ఉంటుంది.. సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆరోజు అర్ధరాత్రి 12:30 నిమిషాల నుంచే ఫస్ట్ డే ఫస్ట్ షో రూమ్స్ సైతం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల చేయబోతున్నారు.

షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా బడా స్టార్ హీరోలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉండడంతో ఎవరిది పై చేయి అనే విషయంపై అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. సలార్ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా పృథ్వీరాజ్ సుకుమారి విలన్ గా నటిస్తూ ఉండగా జగపతిబాబు శ్రియ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హోంభలే వారు భారీ బడ్జెట్లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం రెండో ట్రైలర్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: