గతంలో సమంత ఎలాంటి విషయాన్ని అయినా సరే ఎక్కువగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉండేది.. ఈ ఏడాది ఏప్రిల్ వరకు చలాకీగా ట్విట్టర్లో ఉన్న సమంత ఆ తర్వాత ట్విట్టర్ నుంచి ఎలాంటి పోస్ట్ చేయలేదు. ముఖ్యంగా తన కొత్త ప్రొడక్షన్ హౌస్ కోసం కూడా ఆమె కేవలం తన ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అప్డేట్ ఇస్తూ ఉన్నది. సమంత ట్విట్టర్ నుంచి దూరమయిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే ఇందుకు ముఖ్య కారణం ట్రోలింగ్ దారుణమైన కామెంట్స్ చేయడం వంటివి అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
గతంలో కూడా హీరోయిన్ రాశి ఖన్నా పైన కూడా ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు రెచ్చగొట్టే ప్రకటనలు రావడంతో ఆమె ట్విట్టర్ నుంచి వాకౌట్ అవ్వడం జరిగింది.. సమంత నాగచైతన్య తో విడాకులు ప్రకటించినప్పటి నుంచి ఈమె పైన చాలా దారుణంగా ట్రోల్స్ వినిపిస్తూ ఉండేవి.. అంతేకాకుండా సమంత పైన నీచాతి నీచంగా కామెంట్స్ చేస్తూ ఉండడంతో పాటు పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తూ ఉండడంతో సమంత ట్విట్టర్ నుంచి దూరంగా ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలన్నిటికీ చెక్ పెట్టే విధంగా సమంత ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేస్తుందేమో చూడాలి మరి.