ఈ టైటిల్ చూడగానే మీరు కాస్త కన్ఫ్యూజన్ కి గురి కావచ్చు. ఎందుకంటే సిల్క్ స్మిత అంటేనే ఐటమ్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఆమె ఒంపు సొంపుల్లో ప్రేక్షకులను గింగిరాలు తిప్పి వదిలేసేది.ఒక తరం ప్రేక్షకులకు సిల్క్ అంటే ఆరాధ్య దేవత. అలాంటి ఒక ఐటమ్ గర్ల్ డాన్స్ ఏమాత్రం చేయలేదు అంటే మామూలుగానే అందరూ షాక్ తినాల్సిందే. నిజానికి యాక్టర్ గా తన ప్రస్తానాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత డాన్స్ పై ఫోకస్ చేసి ఐటమ్ సాంగ్స్ లో ఎక్కువగా నర్తించింది. ఫ్లాప్ అయ్యే సినిమా కూడా సిల్క్ స్మిత పాటతో హిట్ సినిమాగా మారిపోయేది.అప్పట్లో విడుదలకు నోచుకోని సినిమాలన్నీ కూడా సిల్క్ స్మిత పాటను జోడించి విడుదల చేస్తే హీట్ టాక్ తెచ్చుకునేవి. అంతటి ప్రభావాన్ని చూపిన సిల్క్ స్మితకు నిజంగానే డాన్స్ రాదంటారా ? మరి ఈ మాట అన్నది ఎవరు? ఎందువల్ల ఇంత పెద్ద మాట అనాల్సి వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ మాట అన్నది మరెవరో కాదు అప్పట్లోనే మొగ కొరియోగ్రాఫర్స్ కి దీటుగా సినిమాలను కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ స్వర్ణ నిన్న మొన్నటి వరకుఆచార్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా ఆమె డాన్స్ మాస్టర్ గా పనిచేశారు అంతటి చరిత్ర ఉన్న స్వర్ణ మాస్టర్ సిల్క్ స్మితతో సైతం ఒక పాట చేశారు. బావలు సయ్య మరదలు సయ్యా అనే పాటలో సిల్క్ స్మిత చేసిన డాన్స్ కి స్వర్ణ డాన్స్ మాస్టర్ గా పని చేశారు.  అయితే ఆమె ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత అసలు డాన్స్ చేయలేదని ఆ పాటలో చేతులు కాళ్లు ఊపిందని అయితే ఆ పిచ్చి గంతులను డాన్స్ అంటూ యువత రెచ్చిపోయేవారు అని తెలిపారు. ఆ మాట విన్న యాంకర్ కాస్త తమాయించుకొని ఆమె ఎక్స్ప్రెషన్ తో, బాడీ లాంగ్వేజ్ తో ఆ పాటకి అందం తెచ్చారని చెప్పగా అందుకు ఒప్పుకున్న స్వర్ణ తనకు ఎక్స్ప్రెసివ్ గా చేయడం తెలుసు కానీ డాన్స్ అది కాదని చెప్పే ప్రయత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: