ఈ మధ్యకాలంలో అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలుగా వస్తున్న సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి సినిమాల్లో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి. చాలా తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా వచ్చిన మా ఊరి పొలిమేరా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పన అవసరం లేదు. డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా రెస్పాన్స్ ను అందుకుంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో

పొలిమేర టు సినిమాని డైరెక్ట్ గా థియేటర్స్ లో విడుదల చేశారు. మొదటి పార్ట్ రెస్పాన్స్ భారీ స్థాయిలో రావడంతో పొలిమేర టుపై అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మొదటి పార్ట్ ను ఊహించిన విధంగా నెక్స్ట్ లెవెల్ ట్విస్టులను చూయించారు. దానితో పొలిమేర టు పై ఎక్కడ లేని అంచనాలు పెరిగిపోవడంతో విడుదలైన మొదటి రోజే సినిమా చూసేందుకు క్యూ కట్టారు జనం. థియేటర్స్ లో రిలీజ్ అయిన పొలిమేర టు ఆశించిన స్థాయి కంటే ఎక్కువే రెస్పాన్స్ కనబరిచింది. మొదటి పార్ట్ అంత కాకపోయినా పార్టీ టు పర్వాలేదు అని కొంతమంది

 కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు పొలిమేర టు సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఓటీటీలో మా ఊరి పొలిమేర 2 ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ ఆహా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మా ఊరి పొలిమేర లో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.  అంతే కాదు రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: