సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రజనీకాంత్ ప్రస్తుతం 170 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జై భీమ్ మూవీ తో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న TJ జ్ఞాన వేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'Thalaivar170' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు స్టార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. తెలుగు నుంచి దగ్గుబాటి రానా, మలయాళ నుంచి ఫాహాద్ ఫాజిల్ తోపాటూ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ నటిస్తుండడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ మూవీ నుంచి రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్ అందించారు మేకర్స్. ఈ మేరకు మూవీ టైటిల్ టీజర్ ని విడుదల చేశారు. కాగా ఈ చిత్రానికి 'వెట్టయన్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇది తమిళ టైటిల్ కావడంతో ఇతర భాషల్లో వేరే టైటిల్ అనౌన్స్ చేస్తారా? లేక అదే టైటిల్ ని పెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అదిరిపోయింది. మరోసారి ఈ సినిమాలో రజినికాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ స్టార్టింగ్ లో రజనీకాంత్ కుర్చీలో కూర్చుని టేబుల్ మీద కాలు పెట్టి సుభాష్ చంద్రబోస్ బుక్ చదువుతూ కనిపిస్తారు. 

 తర్వాత ఖాకీ షూస్ తో ఆఫీస్ నుంచి బయటికి నడిచి వస్తారు. ఇక టీజర్ చివర్లో 'వేట మొదలైనప్పుడు వేటాడడం తప్పదు' అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగ్  నెక్స్ట్ లెవెల్ ఉంది. టీజర్ లో అనిరుద్ మరోసారి తన బీజీయం తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద రజనీకాంత్ కొత్త సినిమా టీజర్ తో ఫ్యాన్స్ పండగ చేసుకోవడం గ్యారెంటీ. కాగా ఇటీవలే ముంబైలో అమితాబచ్చన్ కి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేశారు. సుమారు 33 ఏళ్ల తర్వాత రజినీకాంత్, అమితాబచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. 1980లో అందాకా నూన్, గిరాఫ్తార్ అంటే సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: