డెవిల్ మూవీతో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ ని అందుకోగా డెవిల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 'ఏజెంట్ డెవిల్ కి కనెక్ట్ చేయండి' అంటూ ఓ బ్రిటిష్ అధికారి ఫోన్ లో మాట్లాడడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. సముద్రంలో ఓ షిప్ పై సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఫైట్ సీన్ తో ఉంటుంది. 

ఆ తర్వాత 'ఓ మర్డర్ కేస్ ని పరిశీలించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు' అంటూ కళ్యాణ్ రామ్ ని చూపించారు. అక్కడి నుంచి కళ్యాణ్ రామ్ తన ఇన్వెస్టగేషన్ స్టార్ట్ చేయడం, ఆ సమయంలో హీరోయిన్ ని చూస్తాడు. ఆ తర్వాత కొన్ని మిస్టీరియర్స్ షాట్స్ చూపించి సినిమాపై అంచనాలను పెంచేశారు. అనంతరం ఓ బ్రిటిష్ అధికారి కళ్యాణ్ రామ్ కి ఆపరేషన్ టైగర్ హంట్ అనే మిషన్ ని అప్పగిస్తాడు. ఆ తర్వాత చూపించిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అంతేకాదు ట్రైలర్ లో ఫ్లాష్ బ్యాక్ షాట్స్ కూడా చూపించారు. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్ మరింత డిఫరెంట్ గా కనిపించింది.

 కళ్యాణ్ రామ్ ఇందులో సీక్రెట్ ఏజెంట్ తో పాటు మరో పాత్ర కూడా ఉంది. అంటే ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశాడా? లేదా ? అనేది రివీల్ చేయలేదు.' శవాలు సాక్షాలు చెప్పడం ఎక్కడైనా చూశారా?..' విశ్వాసంగా ఉండడానికి విధేయతతో బతకడానికి కుక్కని అనుకున్నావ్ రా.. లయన్' అంటూ కళ్యాణ్ మీసం మెలేస్తూ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. బ్రిటిష్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అనే కాన్సెప్ట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మొత్తంగా డెవిల్ ట్రైలర్ సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: