గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న పూజ హెగ్డే ఇండస్ట్రీకి దూరంగా ఉంది. చివరిసారిగా కేసీ కా భాయ్  కిసీ కా జాన్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా అవుతుంది. తాజాగా సమాచారం మేరకు పూజ హెగ్డే కి చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని పాపులర్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భవానీ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

అయితే ఇటీవల దుబాయ్ లో జరిగిన గొడవ తర్వాత పూజా హెగ్డే ను చంపేస్తామని చాలామంది బెదిరిస్తున్నారు. దీంతో పూజా హెగ్డే అక్కడి నుండి వెంటనే బయలుదేరి ఇండియాకి వచ్చేసింది. దీంతో ఈ విషయం తెలిసిన పూజ హెగ్డే అభిమానులు అందరూ ఆందోళన పడుతున్నారు. ఈ విషయం తెలుసాక మీరు క్షేమంగా భారత్ చేరుకోండి.. పూజకు ఇది అస్సలు మంచిది కాదు అంటూ ఆమె అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఆమెకి కామెంట్లు తెలుపుతున్నారు. కానీ ఇప్పటివరకు పూజా హెగ్డే మాత్రం ఈ విషయంపై స్పందించింది లేదు.

 తాజాగా ఈ రూమర్స్ పై పూజా హెగ్డే టీమ్ స్పందించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని పూజా టీం సభ్యుడు ఫ్రీ ఫెస్ జర్నల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి నకిలీ వార్తలను ఎవరు ప్రారంభించారో మాకు తెలియదు. ' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై మాత్రం పూజా స్పందంచలేదు. ఇకపోతే అటు వైరల్ భవాని సైతం ఆయన షేర్ చేసిన పోస్ట్ ను కాసేపటి తర్వాత వెంటనే డిలీట్ చేశారు. దాంతో ఈ వార్తల్లో అసలు నిజం లేదని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: