టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకున్నారు రానా దగ్గుబాటి.. సౌత్ టు నార్త్ హీరోగా విలన్ గా ఎన్నో విజువల్ ఎఫెక్ట్తో కోఆర్డినేటర్ గా నిర్మాతగా సినిమాలకు వ్యవహరిస్తూ ఎన్నో సేవలు అందించిన రానా తనతో పాటు సినీ పరిశ్రమను కూడా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. రానా దగ్గుపాటి కేరాఫ్ కరచపాలెం వంటి ఎన్నో విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను నిర్మించి మంచి పాపులారిటీ అందుకున్నారు. ఘాజీ వంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన సంకల్ప రెడ్డి వంటి దర్శకులను కూడా ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది.


ప్రభాస్ వంటి హీరోల సినిమాలను కూడా ఇంటర్నేషనల్ వేదికగా వెళ్లడానికి రానా ముఖ్య కారణం అని కూడా చెప్పవచ్చు. సినీ పరిశ్రమలో రానా స్థానం ఏంటో బాహుబలి సినిమాతో అర్థమయింది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి వంటి సినిమాలను కూడా చేస్తున్నప్పటికీ రానా సహాయం తప్పక తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా అనే కల్కి సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేస్తూ ఉన్నట్లు సమాచారం. నటుడిగా రానా కెరియర్ విషయానికి వస్తే మొదట శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ వంటి పొలిటికల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.


సినిమా మంచి మెసేజ్ ఓరియంటే సినిమా కావడంతో రానా కెరీర్ కి ప్లస్ అయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి మార్కులే సంపాదించుకున్నారు. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించినా రానా కటౌట్ కి సైతం స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయినప్పటికీ కూడా ఎంతోమంది రానా సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నేనే రాజు నేనే మంత్రి వంటి వైవిధ్యమైన సినిమాతో హీరోగా మంచి క్రేజ్ అందుకున్న రానా ఈ రోజున రానా పుట్టినరోజు కావడంతో సరికొత్త సినిమా టైటిల్ ని రాక్షస రాజా అనే టైటిల్ తో సినిమా అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: