ప్రపంచవ్యాప్తంగా కొట్లాదిమంది చందాదార్లు కలిగిన నెట్ ఫ్లిక్స్ దృష్టి దక్షిణభారత సినిమా రంగం పై పడింది. దక్షిణాదిలో సినిమా తారలను దేవుళ్లుగా ఆరాధిస్తారు కాబట్టి ముందుగా ముంబాయ్ వెళ్ళి బాలీవుడ్ దిగ్గజాలు షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లను కలవకుండా నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చి వరసపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలను అందర్నీ కలవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


నెట్ ఫ్లిక్స్ సిఇఒ ముందు చిరంజీవి రామ్ చరణ్ లను కలిసిన తరువాత ఆతర్వాత వెంటనే మరుసటిరోజు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను కలుసుకుని తారక్ అభిమానులకు ఆనందాన్ని కలిగించాడు. ఇది జరిగిన ఒక్కరోజు గడవకుండానే మహేష్ ఇంటికి వెళ్ళి అక్కడ కాఫీ త్రాగుతూ కొంత సమయం గడిపిన సందర్భానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


దీనికి కొనసాగిపుగా నెట్ ఫ్లిక్స్ సిఈఓ అల్లు అర్జున్ ప్రభాస్ లను కూడ  కలవడంతో వారి అభిమానులు కూడ జోష్ లోకి వెళ్ళిపోయారు. దీనితో  నెట్ ఫ్లిక్స్ సిఇఓ ఇలా వరసపెట్టి టాలీవుడ్ టాప్ హీరోలను కలవడం  వెనుక ఏమైనా వ్యూహాలు ఉన్నాయా అంటూ ఇండస్ట్రి  వరగ్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ప్రపంచంలోనే నెంబర్ వన్ డిజిటల్ హెడ్ వచ్చి అదేపనిగా తెలుగు  హీరోలను కలవడం ఇప్పుడు దక్షిణాది సినిమా రంగంలో సంచలన  వార్తగా మారింది. తెలుస్తున్న  సమాచారం మేరకు మనదేశంలో కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ మన టాప్ హీరోలతో  ఏవో కొన్ని ప్రొజెక్ట్స్ చేస్తుంది అన్న స్పస్టమైన సంకేతాలు వస్తున్నాయి.   ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఓటీటీ రంగంలో కూడ తమ  హవాను మన టాప్ హీరోలు కొనసాగించడానికి భారీ ప్రణాళికలు అనుసరిస్తున్నారు అనుకోవాలి. ఏదిఏమైనా ఈ వ్యూహాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్  గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: