టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎలాంటి పని చేసిన అది ఎప్పుడూ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. తాను తెరకెక్కించిన వ్యూహం సినిమాని చాలా మంది నాయకులు అడ్డుకోవడంతో నిన్నటి రోజున విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ సభ్యులు తెలియజేయడంతో తాజాగా ట్విట్టర్లో సైకిల్ టీ గ్లాస్ నుండి వర్మ ఒక పోస్ట్ ని ట్విట్ చేయడం జరిగింది. సెన్సార్ ఫార్మాలిటీలు ముగించుకొని విడుదల తేదీని ప్రకటించిన వర్మ తన వ్యూహం సినిమా ఎట్టకేలకు ఈనెల 29వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతోందని ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.



అనుకున్నట్టుగానే పసుపు రంగు వేసుకున్న ఒక సైకిల్ తో ఆఫ్ కఫ్  టీ గ్లాస్ పట్టుకొని వర్మ ఒక ఫోజులు ఇవ్వడం జరిగింది..అతడి వెనుక భారీ చింపాంజీని కూడా చూపించారు .ఇంతకీ ఆ సైకలెంటి ఆ గ్లాస్ తో ఫోజులు ఏంటి అని అభిమానులు వర్మాన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది.. వర్మ కావాలని ఇదంతా పసుపు రంగు సైకిల్ ముందు ఎకసెక్కనా అంటూ ఒక అభిమాని కామెంట్స్ చేయడం జరిగింది. జనసేన టిడిపి ఈ రెండు పార్టీలు తక్కువ చూపించి వైసిపి పార్టీని హైలెట్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు..

మరి కొంతమంది కోపం ఉంటే కొట్టు మావ ఇలా సినిమాలు తీసి నొప్పించకు అంటూ పలువురి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది సైకిల్ రిపేర్ చేస్తున్నావా వర్మ అంటే పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.. మరి కొంతమంది సైకిల్ గాజు గుర్తులకు ఓటు వేస్తే చెవులో పూలు పెడతారు అంటూ కూడా ఒక అభిమాని ఫన్నీగా కామెంట్స్ చేశారు ఏది ఏమైనా వర్మ అనుకున్నదే సాధించారని చెప్పవచ్చు. వ్యూహం సినిమా అని ఈ ఏడాది డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: