తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరుపొందిన శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె అందచందాలతో నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.. ఈమె నటవారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఆడపా దడపా సినిమాలలో నటిస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ కొరటాల శివ.


జాన్వీ తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోతో నటించడానికి సిద్ధమయ్యింది.. ఈ సమయంలోనే జాన్వీ కపూర్ తన తల్లిని చాలా మిస్ అవుతున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మొదటి సినిమా ధడక్ షూటింగ్లో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల తన తల్లి పక్కన ఉండలేకపోయానని అమ్మ షూటింగ్ సెట్టింగ్ కి వస్తానన్నా కూడా తాను వద్దని చెప్పేదాన్ని.. అందుకు కారణం తన తల్లి వల్లే ఈమెకు ఆఫర్లు వస్తున్నాయని జనాలు ఫీల్ అవుతారేమో అనుకొని వద్దని చెప్పేదాన్ని అంటూ తెలిపింది..


సినిమాల విషయంలో తనకు సంబంధించిన ఏ విషయంలో కూడా తల్లి తనకు సహాయం చేయవద్దని చెప్పేదాన్ని కానీ అలా చెప్పి ఇప్పుడు చాలా ఫీలవుతున్నారని తెలియజేసింది.. అమ్మ లేని లోటు చాలా క్లియర్ గా కనిపిస్తోందని.. తన తల్లి షూటింగుకు రావాలని తాను చేస్తున్న సినిమాల గురించి తన తల్లితో డిస్కషన్ చేసుకోవాలని ఇప్పుడు అనిపిస్తుంది అంటూ.. అలాగే తన తల్లి తనకు షూటింగ్ ఉందని చెప్పాలని ఉంటుంది... కానీ తన తల్లి లేకపోవడంతో జాన్వీ ఎమోషనల్ అవుతూ ఈ విషయాన్ని తెలియజేసింది. ఇప్పటికీ తనని శ్రీదేవి కూతురుగానే పిలుస్తూ ఉండడం తనకు చాలా గర్వంగా ఉందని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: