'ఖైదీ' మూవీ తో ఓ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు. 'Thalaivar 171' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టును భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. ప్రస్తుతం లోకేష్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో ఓ ప్రత్యేక అతిధి పాత్ర కోసం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ని లోకేష్ సంప్రదించారట. అయితే ఈ ఆఫర్ ని షారుక్ ఖాన్ సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు.
రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' తో పాటూ 'బ్రహ్మాస్త్ర' లాంటి సినిమాల్లో షారుక్ అతిధి పాత్రలు పోషించాడు. కానీ ఆ సినిమాల్లో షారుక్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. పైగా సల్మాన్ ఖాన్ తో కలిసి గెస్ట్అపీరియన్స్ ఇచ్చిన టైగర్ 3 ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకునే షారుక్ రజనీకాంత్ సినిమాలో అతిధి పాత్రలో నటించేందుకు ఆసక్తి కనపరచలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ లోకేష్ కనగరాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో నేరుగా ఓ సినిమాలో నటించాలని షారుక్ ఖాన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అయిన అట్లీతో 'జవాన్' సినిమా చేసి భారీ సక్సెస్ అందుకున్న షారుక్ ఇప్పుడు లోకేష్ తో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో షారుక్ తో లోకేష్ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'డంకీ' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజకుమార్ హిరాని తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు TJ జ్ఞానవెల్ రాజా తో తన 170వ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వెట్టయన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ రీసెంట్ గా రజిని బర్త్ డే కి రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఆకట్టుకుంది.