రెండు వరుస హిట్లు పడిన ఏ హీరోయిన్ కి అయినా క్రేజ్ రావడం కామనే. ఈ క్రమంలో టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ కోసం మేకర్స్ పోటీ పడుతున్నారు. ఆమె థర్డ్ సినిమా ఫ్యామిలీ స్టార్ వస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మొన్నటిదాకా సంక్రాంతి రిలీజ్ అన్నారు కానీ ఇప్పుడు అది మార్చికి వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ సినిమా కూడా హిట్ పడితే మాత్రం టాలీవుడ్ హిట్ మిషన్ గా మృణాల్ కి సెపరేట్ క్రేజ్ వస్తుంది.
ఇప్పటికే వరుస రెండు హిట్లు అందుకుంది కాబట్టి తమ సినిమాల్లో మృణాల్ ని తీసుకోవాలని దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే సీతారామం తర్వాత చాలా కథలు వచ్చినా తన పాత్రకు గుర్తింపు వచ్చే కథలను చేయాలని ఫిక్స్ అయిన మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్నకి ఓకే చెప్పింది. అది హిట్ అయ్యింది సో విజయ్ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ కూడా కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. అది కూడా హిట్ అయితే మాత్రం టాలీవుడ్ లో మృణాల్ ని ఆపడం ఎవరి వల్లా కాదు. ప్రస్తుతానికి యువ హీరోలతో జత కడుతున్న మృణాల్ తన నెక్స్ట్ టార్గెట్ స్టార్ హీరోల మీద పెట్టింది. ఇప్పటికే చిరుతో సినిమా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారగా మిగతా స్టార్స్ కూడా మృణాల్ గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.