వరుసగా విజయాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకున్నది.. సినిమాల పైన ఎంత ఆసక్తి ఉందో తన చదువు పట్ల కూడా అంతే ఆసక్తి కలదు. అందుకే డాక్టర్ కుటుంబం నుంచి వచ్చిన ఇమే డాక్టర్ కావాలని కోరికతో చదువుతూనే ఉంది.. ఒక వైపు సినిమాలు మరొకవైపు ఎంబిబిఎస్ పూర్తి చేసే పనిలో పడింది.. ప్రస్తుతం ఎంబిబిఎస్ చివరి ఏడాది పరీక్షలు సైతం రాయబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18 నుంచి 24 వరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉండబోతున్నాయట. ఈ నేపథ్యంలోని ఇమే హవా ఇప్పుడు కనిపించలేదు.
ప్రస్తుతం పరీక్షల కోసం ముంబైలో ఉందని ఈమె తల్లి కూడా ముంబైకి రావడం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఫైనల్ ఇయర్ పరీక్ష పూర్తి అయిన తర్వాత శ్రీ లీల తల్లితో కలిసి బెంగళూరులో సొంతంగా ఒక హాస్పెటల్ని ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే వీటికంటే ముందు పెద్ద చదువుల కోసం ముందుకు వెళ్లాలా లేకపోతే సినిమాలలో కొనసాగించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏది ఏమైనా శ్రీలీల రష్యా కి వెళ్తే శ్రీ లీల సినీ కెరియర్ వదులుకోవాల్సిందే..