ఇప్పటికే 900 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఇంకా భారీగా వసూలు సాధిస్తూ దూసుకుపోతూనే ఉంది. అయితే ఇక ఈ మూవీలోని పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా ఇక విలన్ బాబీ డియోల్ నటనకు అయితే ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఏకంగా ఒక క్రూరమైన విలన్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు బాబి డియోల్. ఇక కొన్ని కొన్ని సీన్స్ లో అయితే ఇంత క్రూరంగా చూపించారేంటి అని ప్రేక్షకులకు అనిపించేంతల ఇక పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే యానిమల్ లో కొన్ని సన్నివేశాలలో నటించడానికి ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు బాబి డియోల్.
సినిమాలోని కొన్ని సీన్లలో నటించే సమయంలో తనకు ఎంతో ఇబ్బంది కలిగింది అంటూ తెలిపాడు. ఆ భావాలను తొలగించడానికి తాను కేవలం ఒక పాత్రలో మాత్రమే నటిస్తున్నాను అనుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీలో తన క్యారెక్టర్ ను విలన్ గా భావించలేదని.. కుటుంబాన్ని అతిగా ప్రేమించే వ్యక్తిగా భావించాను అంటూ తెలిపాడు. తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే ఒక వ్యక్తిగా అనుకొని.. ఇక ఈ పాత్రలో నటించాను అంటూ తెలిపారు బాబి డియోల్.