ఈశ్వర్ సినిమా ఒక బస్తీలో సాగే కథ అలాగే మాస్ హీరోగా ప్రభాస్ ని గుర్తించేలా చేసింది.ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా అతనిలోని భక్తి కోణాన్ని కూడా చూపించి హిట్టు వచ్చేలా చేసింది. ఇక వర్షం సినిమా గురించి చెప్పేది ఏముంది అది ఒక సూపర్ కమర్షియల్ ఫార్ములా. వర్షం హిట్ రాగానే అడవి రాముడు వంటి ఒక భిన్నమైన సినిమాతో కూడా తెరపైకి వచ్చాడు. ఇది పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ ఈ చిత్రం తర్వాత చక్రం అనే మరొక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. చక్రం ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసిన ఆ తర్వాత చత్రపతి లాంటి ఒక అద్భుతమైన చిత్రం ప్రభాస్ ఖాతాలో పడింది.
ఇచ్చిన తర్వాత పౌర్ణమి సినిమా తీసిన అది కూడా ప్రభాస్ కి మంచి పేరును తీసుకొచ్చింది అలాగే దీని కథకు అంతకుముందు తీసిన కథలతో ఎలాంటి సంబంధం లేకుండా తీయడం విశేషం. అక్కడి నుంచి మొదలు నిన్న మొన్నటి ఆది పురుష్ వరకు అన్ని కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండానే ఉంటాయి. బాహుబలి, సాహో, రాదే శ్యామ్ ఇలా అన్ని చిత్రమైన విచిత్రమైన కథలను ఎంచుకుంటూ తన కెరియర్ ను ముందు తీసుకెళ్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఇక సలార్( Salaar ) మరో రేంజ్ సినిమా అని అందరూ అంటున్నారు. ఇలా సంబంధమే లేని కథలతో సంబంధం లేని సినిమాలు తీస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం నిజంగా గొప్ప విషయమే కదా.