పల్లవి ప్రశాంత్..సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. రైతు బిడ్డగా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ ఏకంగా సీజన్ 7 టైటిల్ ను గెలుచుకున్నాడు..అయితే అంతవరకు బాగానే వుంది.. కానీ అతడిని విజేతగా అనౌన్స్ చేసిన తరువాత ఫ్యాన్స్‌ చేసిన విధ్వంసం సృష్టించారు.బిగ్‌బాస్ టైటిల్‌ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు.  అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ కూడా బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అనుదీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మరో కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను కూడా పగులగొట్టారు. రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్‌ బస్సు అద్దాన్ని కూడా పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్‌, ఏ2గా మనోహర్‌, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ ను కూడా చేర్చారు. ఇప్పటికే ఏ4గా ఉప్పల్‌కు చెందిన సాయికిరణ్‌ మరియు అంకిరావుపల్లి రాజును అరెస్ట్‌ చేసిన పోలీసులు పల్లవి ప్రశాంత్‌ ను , మనోహర్‌తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకుని కోర్ట్ ముందు హాజరు పరిచారు.తాజాగా ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసుల ముందు విచారణకు ఆదివారం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే.. రూ.15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కూడాకోర్టు తెలిపింది. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అతనికి సపోర్ట్ గా నిలిచారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్  ఈ విషయం పై స్పందించాడు..సామాన్యుడిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం బాధాకరం.. అతను ఎంతో అమాయకుడు.. కొంతమంది పబ్లిసిటీ కోసం అలా దాడి చేయడం చేసారు.ప్రశాంత్ కేవలం తనకి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని కలవాలి థాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఫ్యాన్స్ ను పలుకరించడానికి తిరిగి వచ్చిఉంటాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేయకూడదు. అది పూర్తిగా అది చట్ట వ్యతిరేక చర్య అవుతుంది. కానీ ఆ దాడికి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదు. అని కౌశల్ ప్రశాంత్ కు సపోర్ట్ గా నిలిచాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: