టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. చిన్న బాబు , సూర్య దేవర నాగ వంశీ భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో రమ్య కృష్ణ , జయరామ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. 

అందులో మొదటగా "దమ్ మసాలా" అనే సాంగ్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఆ తర్వాత "ఓ మై బేబీ" అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయగా దానికి మాత్రం ప్రేక్షకుల నుండి గొప్ప రెస్పాన్స్ లభించలేదు. ఇకపోతే ఈ మూవీ నుండి నెక్స్ట్ ఒక అదిరిపోయే మాస్ బీట్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో మహేష్ , శ్రీ లీల అదిరిపోయే రేంజ్ మాస్ స్టెప్ వేస్తూ ఉన్నారు.  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. తాజాగా గుంటూరు కారం మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉండగా శ్రీ లీల రెడ్ కలర్ శారీలో బ్లాక్ కలర్ బ్లౌజ్ లో అదిరిపోయే లుక్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: