టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇక ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. దీంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క పాటను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భంగా గుంటూరు కారం సినిమా నుండి మరొక సర్ప్రైసింగ్ పోస్టర్ని సైతం విడుదల చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం గుంటూరు కారం

సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే మహేష్ బాబు ఈ సినిమాలో ఒక పాట పాడాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక్కడు సినిమాలో 'చెప్పవే చిరుగాలి' సాంగ్ పాడిన మహేష్ ఆ తర్వాత అలాంటి సాహసం చేయలేదు . అయితే గుంటూరు కారంలో మాత్రం శ్రీ లీలను ఇంప్రెస్ చేయడానికి చెప్పవే చిరుగాలి పాట పాడతాడట . ఈ సీన్ కి ధియేటర్స్ లో విజిల్స్ మోగాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా

 ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో కొన్ని పాటలలో శ్రీ లీల మహేష్ బాబు జోడి అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు సినీ లవర్స్. ప్రస్తతానికైతే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్గా శ్రీ లీలనే కనబడుతోంది. ఇక ఇప్పటివరకు విడుదలైన సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ గుంటూరు కారం సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.!!

మరింత సమాచారం తెలుసుకోండి: