పాన్ ఇండియా స్టార్ హీరో సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి  తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది.ఈ మూవీ విడుదల అయ్యి మూడు రోజులు పూర్తిచేసుకుని నాలుగవ రోజుకి కొనసాగుతుంది. అయితే మూడు రోజులకు గాను ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఎన్నో సంచలనాలను సృష్టిస్తుంది. ఈ సినిమా మొత్తం మూడు రోజులకు ఏకంగా 402 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు హోం బలే ఫిలిం మేకర్స్ వారు అధికారక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.ఇలా మూడు రోజులకే 400 కోట్ల కలెక్షన్లు అంటే ప్రభాస్ మేనియా మామూలుగా లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ స్థాయిలోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇలా మూడు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో ముందు ముందు ఈ సినిమా ఖచ్చితంగా మరిన్ని కలెక్షన్లను రాబడుతుందోనని సినీ సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా షారుఖ్ ఖాన్ సినిమాని వెనక్కి నెట్టి సలార్ సినిమా చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.సలార్ సినిమా దూకుడు చూస్తుంటే వారం తిరిగేలోగా ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.బాహుబలి సినిమా సినిమా తరువాత ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమా బాలీవుడ్ లో ప్రభాస్ కి 5 వ 100 కోట్ల సినిమాగా నిలిచింది. బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆది పురుష్ సినిమాల తరువాత సలార్ సినిమా 100 కోట్లు రాబట్టింది.ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ఫిబ్రవరిలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: