ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పార్ట్-1 భారీ సక్సెస్ అవడంతో 'పుష్ప 2' ని అంతకుమించేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ సుకుమార్. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యాడు బన్నీ. ఆమధ్య బోయపాటితో కూడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. 

అయితే లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్నారట. ఈ ఏడాది బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ తో 'జవాన్' సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు అట్లీ. ఈ సినిమాతో నార్త్ లో అట్లీకి భారీ డిమాండ్ పెరిగింది. జవాన్ తర్వాత మళ్లీ షారుక్ ఖాన్, దళపతి విజయ్లతో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన అట్లీ ఇప్పుడు ఐకాన్ స్టార్ తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. బన్నీతో సినిమా చేసేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ కోలీవుడ్ దర్శకుడు.

అంతెందుకు జవాన్ సినిమాలోనే బన్నీ ని క్యామియో రోల్ కోసం అప్రోచ్ కూడా అయ్యాడు. కానీ అందుకు బన్నీ నో చెప్పాడు. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ తో ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా తీయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 2024 మార్చ్ లేదా ఏప్రిల్ లో అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. అప్పటికి అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి బన్నీ డేట్స్ కూడా కలిసి వస్తాయి. అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూపించని విధంగా ఓ సరికొత్త పాత్రలో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ని అట్లీ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. పుష్ప 2 రిలీజ్ అనంతరం అంటే ఆగస్టులో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: