KGF డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ 'సలార్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజే రూ.178 కోట్ల గ్రాస్ అందుకొని ఈ ఇయర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది.రెండో రోజు రూ. 250 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడో రోజు కలుపుకొని ఓవర్‌ ఆల్‌గా ఈ రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది. క్రిస్మస్‌ సెలవులు ఉండడం, పోటీగా మరే లేకపోవడంతో సలార్‌ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రభాస్ నుండి చాలా కాలం తర్వాత వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కావడంతో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే సినిమాలో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్.. ఇలా అన్నీ బాగున్నా ఆడియన్స్ కి ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అందులో రిలీజ్ కి ముందు చాలా మంది మాట్లాడుకున్న అంశం సలార్ ఐటమ్ సాంగ్ గురించే. అగ్ర హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ఐటం సాంగ్స్ ప్రధాన పాత్రలు పోషిస్తాయి. సలార్ కంటే ముందు ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సిరీస్ లో తమన్నా, మౌనీ రాయ్ వంటి హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయించాడు.

వాటి తరహాలోనే సలార్ లో అలాంటి ఐటమ్ సాంగ్ ఉంటుందని వార్తలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్ లో యంగ్ హీరోయిన్ సిమ్రాత్ కౌర్ తో ఈ ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించినట్లు చెప్పారు. తీరా రిలీజ్ తర్వాత చూస్తే సలార్ లో ఎలాంటి ఐటమ్ సాంగ్ లేదు. దాంతో ఈ విషయంలో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా విడుదలై భారీ వసూళ్లు అందుకుంటున్న తరుణంలో చాలామంది ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. సలార్ లో ఐటమ్ సాంగ్ పెట్టుంటే సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయి ఉండదని కొందరు చెపుతుంటే, మరికొందరు అసలు ఈ ఐటమ్ సాంగ్ ని షూట్ చేశారా? లేక దీన్ని సెకండ్ పార్ట్ శౌర్యంగా పర్వంలో చూపించబోతున్నారా? అనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: