గోవాలో నిర్వహించిన ఈ అవార్డు వేడుకలు నాలుగు దక్షణాది భాషల నుంచి కూడా ఎంతోమంది నటిటులు సాంకేతిక నిపుణులు ఇతర చిత్ర బృందాలు కూడా రావడం జరిగింది. వీరికి సౌకర్యాలు కల్పించడంలో ఈయన చాలా విఫలమయ్యారని సమాచారం. దీంతో ఇతర భాషలను సెలబ్రిటీల నుంచి సురేష్ కొండేటి పైన విమర్శలు వినిపించాయి.. సెలబ్రిటీలు ఉన్న హోటల్స్ లకు రూమ్ బిల్లు కూడా చెల్లించలేదని దీంతో వాళ్లు తమ రూమును ఖాళీ చేయాలంటూ యాజమాన్యాలు తెలిపారంటూ కన్నడ సెలబ్రిటీలు తెలుపుతున్నారు.
అవార్డులు ఇచ్చే సమయంలో కూడా కన్నడ సినీ నటులను అవమానించారంటూ ఒక మహిళా జర్నలిస్టు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ మరి అడగడం జరిగింది. అవార్డు వేడుకల నిర్వహుడైన సురేష్ కొండేటి మధ్యలోని వెళ్లిపోయినట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ పైన చాలామంది సెలబ్రిటీలు తిట్టడం మొదలుపెట్టారు. గతంలో చిరంజీవి పీఆర్వో సురేష్ కొండేటి అని ప్రచారం కూడా జరిగింది. ఈ విషయం పైన నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తే తమ కుటుంబానికి సురేష్ కొండేటి కి ఎలాంటి సంబంధం లేదంటూ తెలిపారు. ఇలా తెలుగు ఇండస్ట్రీ పైన నిందిస్తూ ఉండడంతో తెలుగు ఫిలిం చాంబర్ నుంచి నిర్మాత మండలి సురేష్ కొండేటికీ ఒక నోటీసులు జారీ చేశారు.. దీంతో ఆయన నుంచి సరైన వివరణ రాకపోవడంతో సురేష్ కొండేటిని నిర్మాతల మండల నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పదవి నుంచి కూడా తొలగించారట.