పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రభాస్ నాన్ వెజ్ లవర్ అన్న సంగతి తెలిసిందే. మాంసాహారం రోజు తింటాడు ప్రభాస్. ప్రతిరోజు నాలుగైదు రకాల వంటలతో తన భోజనాన్ని చేస్తారు. ప్రభాస్ కి ప్రతిరోజు విందు భోజనం అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఒంటరిగా ఎప్పుడు ఒక్కరే భోజనం చేయరట. స్నేహితులతో తనతో కలిసి పనిచేసే వారితో నో లేక కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తారట. ప్రభాస్ తో పాటు పది నుండి 20 మంది వరకు కలిసి భోజనం చేస్తేనే ప్రభాస్ కూడా భోజనం చేస్తారట.

అయితే ప్రభాస్ కి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టేందుకు ఒక టీం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ కోసం ఆ టీం ఎప్పుడు రకాల వంటలను కొత్త కొత్త వంట లను తయారు చేస్తూ ఉంటారట. అయితే ప్రభాస్ భోజనం మెనూ చాలా పెద్దగా ఉంటుందని అంటున్నారు. చికెన్ మటన్ చేపలు రొయ్యలు అన్ని రకాల వంటలు ప్రతిరోజూ ఉండాల్సిందేనట. ఈ క్రమంలో ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అన్న విషయం సోషల్ మీడియా వేదికగా అవుతుంది. అయితే ప్రభాస్ కు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమట. అంతేాదండోయ్ ఎప్పుడు దాన్ని తినడానికి

ఇష్టపడుతూ ఉంటారట ప్రభాస్. ప్రభాస్ తో పని చేసిన చాలా మంది హీరోయిన్స్, నటులు ఆయన ఆతిథ్యం స్వీకరించారు. ప్రపంచంలోని అరుదైన వంటకాలతో హీరోయిన్స్ కి విందు ఏర్పాటు చేయడం ఆయనకు అలవాటు. అయితే  సలార్ లో నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ భార్య, పిల్లలు సెట్స్ కి వచ్చారని తెలుసుకున్న ప్రభాస్… గది మొత్తం వంటకాలతో నింపేశాడట. ప్రభాస్ తో ఉంటే డేంజర్, డైట్ మటాష్ అవుతుందని పృథ్విరాజ్ స్వయంగా తెలియజేశారు. కాగా ఇంతటి ఆహార ప్రియుడైన ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు రూ. 2 లక్షలు అవుతుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: