టాలీవుడ్ నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటించి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రణబీర్ కపూర్ రష్మిక మందన కాంబినేషన్లు వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు సినిమాలో మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రష్మిక మందన. అలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మిక మందన బాయ్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయాన్ని బయట పెట్టింది. 

అయితే తన బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అయితే యానిమల్ సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయింది రష్మిక. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఎవరు ఏంటి అన్న వివరాలను బయట పెట్టింది. అయితే రష్మిక కి బాయ్ ఫ్రెండ్ ఏంటి అని షాక్ అవుతున్నారా.. మీరు అనుకున్నట్టు కాదు.. ఇది సినిమాలో భాగం మాత్రమే. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా లేడీ ఒరియెంటెడ్గా తెరకెక్కుతుండగా.

 ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండుగా ఓ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు..దసరా సినిమాలో నాని ఫ్రెండుగా నటించిన దీక్షిత్ శెట్టి . ఈ కుర్ర హీరో..దసరాలో నటించి..అమ్మాయిలకు తెగ నచ్చేశాడు.ఇప్పుడు ఈ హీరో రష్మిక బాయ్ ఫ్రెండుగా ది గర్ల్ ఫ్రెండు మూవీలో నటించనున్నారు. రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్.ఇతనే అంటూ మేకర్స్ స్పెషల్ వీడియోతో తెలిపారు.ప్రస్తుతం రష్మిక బాయ్ ఫ్రెండు అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: