న్యాచురల్ స్టార్ నాని హీరోగా రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన 'హాయ్ నాన్న' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. శౌర్యువ్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలై ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.   'హాయ్ నాన్న' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్సినిమా ఓటీటీ రైట్స్ ని రూ.37 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లో రిలీజ్ అయిన 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా సినిమా ప్రొడ్యూసర్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. 

దాని ప్రకారం హాయ్ నాన్న మూవీ జనవరి 19 లేదా జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో సంక్రాంతికి ఓటీటీ లో వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. జనవరి 19 లేదా రిపబ్లిక్ డే సందర్భంగా హాయ్ నాన్న ఓటీటీ లో వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే హాయ్ నాన్న మూవీకి రూ. 27.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా

 కేవలం పది రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని అందుకొని లాభాల బాట పట్టింది. అంతేకాదు ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తవక ముందే ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ దాటింది. దీంతో టైర్ 2 హీరోల్లో ఎక్కువ సార్లు ఓవర్సీస్ మార్కెట్ వద్ద 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేశాడు. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను అందుకోవడం విశేషం. ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్న నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: