ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ఏదైనా ఈవెంట్స్ కి కానీ ఫంక్షన్ కి కానీ పెద్ద ఎత్తున హాజరవుతూ ఉన్నారు. ఇలా సెలబ్రిటీలందరూ ఒకే చోటు కనిపిస్తే చాలు వీరి గురించి పలు రకాల వార్తలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు వేసుకొనే దుస్తులపైన అందరి దృష్టి ఉంటుందని చెప్పవచ్చు.. ఇలా వారు వేసుకున్నటువంటి దుస్తుల ధరలు బ్రాండ్స్ గురించి ఎక్కువగా అభిమానులు ఆరా తీయడం జరుగుతూ ఉంటుంది. సెలబ్రిటీలు అన్న తర్వాత ఖరీదైన బ్రాండెడ్ దుస్తులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు.


వీరు వేసుకొని చెప్పులు, వాచ్ ,దుస్తులు కొన్ని లక్షలు కోట్ల రూపాయల కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇటీవల టాలీవుడ్ లో మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోటు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టుగా కొన్ని రకాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా అల్లుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ఈ క్రిస్మస్ వేడుకలలో భాగంగా మెగా కోడలు ఉపాసన ,లావణ్య త్రిపాఠి, స్నేహారెడ్డి తో పాటు మహేష్ బాబు భార్య నమ్రత కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.


క్రిస్మస్ కావడంతో వీరందరూ కూడా ఎరుపు రంగు దుస్తులలోనే కనిపించారు. అయితే ఉపాసన క్రిస్మస్ సెలబ్రేషన్ లో వేసుకున్నటువంటి డ్రెస్ ఖరీదు గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ 3 లక్షల రూపాయలు ఖర్చు చేశారని విషయం వైరల్ గా మారుతోంది .ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కేవలం ఒక్కరోజు వేసుకొని ఈ క్రిస్మస్ స్పెషల్ డే దుస్తుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారా అంటూ పలువురు అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: