మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ సోసియో ఫాంటసీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'Mega156' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే ఇంకా మెగాస్టార్మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. ప్యాడింగ్ ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించి ఇటీవల ఓ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. సంక్రాంతి తర్వాత చిరంజీవిసినిమా షూటింగ్లో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడేమో ఇంకాస్త ఆలస్యంగా

 ఫిబ్రవరిలో షూటింగ్లో పాల్గొంటారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ గా దగ్గుపాటి రానా నటిస్తున్నాడని ఇటీవల వార్తలు తెరపైకి వచ్చాయి. రానా కూడా ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. ప్రాథమికంగా కథా చర్చలు జరిగిన తర్వాతే ఓకే అనుకున్నారు. కానీ డేట్స్ ఇష్యూస్ తో పాటు ఇతర కారణాల వల్ల రానా ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్లు తెలిసింది. ఇక తాజాగా దగ్గుబాటి రానా ప్లేస్ లో బాలీవుడ్ విలన్ కునాల్ కిషోర్ కపూర్ ని తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఇతను తెలుగులో నాగార్జున, నానిల మల్టీ స్టారర్ 'దేవదాస్' లో విలన్ గా నటించాడు.

ఆ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విలనిజం చూపించి సైమా అవార్డుకు సైతం నామినేట్ అయ్యాడు. కానీ అది జస్ట్ లో మిస్ అయింది. సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఇతను తెలుగులో కనిపించలేదు. అమీర్ ఖాన్ రంగ్ దే బసంతి నుంచే బాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితుడైన కునాల్ తన 19 ఏళ్ల సినీ కెరియర్ లో చాలా తక్కువ సినిమాలు చేశాడు. ఈసారి టాలీవుడ్ లో మెగాస్టార్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు. ఈ సినిమా కనుక సక్సెస్ అయ్యి అందులో కునాల్ కిషోర్ విలనిజం క్లిక్ అయితే కచ్చితంగా టాలీవుడ్ లో ఇతనికి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: