తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక.. తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. కొన్నేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈమె ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. వివాహమైన తర్వాత పూర్తి కెరియర్ హన్సిక సినిమాల వైపే పెట్టింది.


ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మై నేమ్ ఇస్ శృతి.. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కథ అంశంతో తెరకెక్కించారు. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తయిందో తెలియదు అనూహ్యంగా వాయిదా పడుతూ వస్తూ వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనివాస ఓంకార్ తెరకెక్కించారు.. లేడీ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా హన్సికకు ప్లాపును తెచ్చి పెట్టింది. ఇందులో నటనపరంగా విమర్శకుల నుంచి హన్సిక ప్రశంశాలు సైతం అందుకుంది.


సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటి లో స్ట్రిమ్మింగ్ కాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు మధ్యాహ్నం స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలియజేసింది. ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో అందుబాటులోకి రాబోతోంది.ఇందులో మురళీ శర్మ పూజ రామచంద్రన్ కీలకమైన పాత్రలో నటించారు.. కథ విషయానికి వస్తే ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేసే శృతి స్కిన్ మాఫియాలో ఎలా పడింది ఆ మాఫియా నుంచి ఈమె ఎలా బయటపడింది అనే కదా అంశంతో విడుదల కావడం జరిగింది. థియేటర్లో మెప్పించ లేకపోయినా హన్సిక మరి ఓటీటి లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: