డెవిల్ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో డెవిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. చిత్ర బృందం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ ని చేసుకుంది ఈ సెలబ్రేషన్స్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ డెవిల్-2 సినిమా ఖచ్చితంగా ఉంటుందంటూ ఇదే టీమ్ తో చేస్తామంటూ తెలియజేశారు.. 2024లో డెవిల్-2 మొదలుపెట్టి 2025లో విడుదల చేస్తామంటూ తెలిపారు. ఈ సినిమా షూట్ మొత్తం పది రోజులకే శ్రీకాంత్ పార్ట్ -2 కథను సైతం తనకి చెప్పారంటూ తెలిపారు.
సీక్రెట్ సర్వీస్ తో ఈ కథ ముగుస్తుందని ఆ లైన్ తనకు బాగా నచ్చింది అంటూ తెలిపారు కళ్యాణ్ రామ్. డెవిల్-2 చిత్రం 1940 కాలంలో రాబోతోంది అలాగే 2000 సమయంలో కూడా ఉంటుంది అని రెండు కాలాలకు సంబంధించిన ఈ కథ ఒకేలా సాగుతుందని తెలిపారు. ఓవరాల్ గా డెవిల్ -2 చిత్రంపై కళ్యాణ్ రామ్ తెలియజేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ డెవిల్ చిత్రం రాబట్టిందనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది గంటలు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.