2024 సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి.. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమా కూడా పోటీగా విడుదల కాబోతోంది.. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి గుంటూరు కారం చిత్రం పైన భారీ హైప్స్ ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మాస్ అప్డేట్లతో సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతికి స్టార్ హీరోస్ వస్తూ ఉండడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయని చెప్పవచ్చు.


డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలు అంటే మంచి క్రేజీ ఉంది.. తేజ సజ్జా  కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. హనుమాన్ చిత్రంలో హనుమంతుడి ఆధారంగా ఒక కుర్రోడికి సూపర్ హీరోస్ వస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ తో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. హనుమాన్ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం దాదాపుగా పది భాషలలో విడుదల చేయబోతున్నారు.


మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తేజా సజ్జా నటించిన హనుమాన్ సినిమా రెండూ ఒకే రోజు జనవరి 12న విడుదల కాబోతున్నాయి. ఒక స్టార్ హీరో తో చిన్న హీరో అని మాస్ కమర్షియల్ చిత్రంగా ఈ సినిమా పోటీ ఉంటుందని అందరూ భావిస్తూ ఉన్నారు. చైల్డ్ యాక్టర్ గా తేజ సజ్జా ఎన్నో చిత్రాలలో నటించారు. 2000 సంవత్సరంలో మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రంలో తేజ మహేష్ బాబు కొడుకుగా నటించారు. ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత అదే తేజ సజాత మహేష్ బాబు తో పోటీ పడుతూ సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తూ ఉండడంతో చాలా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: