సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకోగా తాజాగా మూడో పాట రిలీజ్ చేశారు. 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ కి ఈ సాంగ్ నచ్చడం అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరు ఊహించని విధంగా ఈ పాట కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు తన సినిమాలో ఇలాంటి పాటను ఎలా అంగీకరించాడా? అని చాలామంది నేటిజన్స్ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే మహేష్ బాబు లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో ఇలాంటి బూతు పదాలతో కూడిన పాట పెట్టడం ఏంటని మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ పాట ఓనర్ ఆయన కుర్చీ తాత గురించి ఈ సాంగ్ కోసం అతనికి ఇచ్చిన రెమ్యూనరేషన్ గురించి కూడా డిస్కషన్ నడుస్తోంది. హైదరాబాదులోని కాలా పాషా అనే ఓ తాత గతంలో ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చెబుతూ 'కుర్చీ మడత పెట్టి' అనే బూతు పదంతో కూడిన డైలాగ్ ని వాడాడు.

 ఇది సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా బాగా వైరల్ అయింది. దాంతో ఈ డైలాగ్ కాస్త ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే ఈ తాత అసలు పేరును మరిచిపోయి అందరూ కుర్చీ తాత అని పిలవడం మొదలు పెట్టేంతలా ఈయనకి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అతని మాటల్ని పాటగా మార్చేసాడు తమన్. అయితే ఇందుకోసం కుర్చీ తాతకు తమన్ ఐదు వేల రూపాయలు ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా కుర్చీ తాత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక తాత మాటలని మాస్ సాంగ్ గా మార్చి తాజాగా రిలీజ్ చేసిన కుర్చీ మడతపెట్టి ప్రోమో సాంగ్ లో మహేష్, శ్రీ లీల మాస్ స్టెప్పులు బాగానే వేసినప్పటికీ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: