‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కు వరసగా మూడు ఫ్లాప్ లు రావడంతో అతడి కెరియర్ ప్రశ్నార్థకంగా మారినప్పటికీ ప్రేక్షకులలో అదేవిధంగా దర్శక నిర్మాతలలో ప్రభాస్ కు ఎలాంటి మ్యానియా ఉందో లేటెస్ట్ గా విడుదలైన ‘సలార్’ మూవీకి వచ్చిన భారీ కలక్షన్స్ తెలియచేశాయి. వాస్తవానికి ‘సలార్’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈమూవీ మొదటివారంలో 500ల కోట్ల కలక్షన్స్ వసూలు చేయడం ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అంటూ చాలమంది కామెంట్స్ చేస్తున్నారు.



‘సలార్’ హడావిడి ముగిసి పోవడంతో సమ్మర్ లో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ పై ఉంది. ఈసినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండటంతో పాటు ఈమూవీలో అమితా బచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనె లాంటి హేమాహేమీలు నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమాకు సంబంధించి కేవలం గ్రాఫిక్ వర్క్స్ పైన 2వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉండటంతో ఈసినిమా బడ్జెట్ 5 వందల కోట్ల స్థాయికి చేరుకుంది  అని అంటున్నారు.



దీనితో ఈసినిమా బిజినెస్ 8 వందల కోట్ల స్థాయిలో చేయవలసి ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు ‘సలార్’ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడ 5 వందల కోట్ల కలక్షన్స్ మార్క్ ను దాటిపోవడంతో ‘కల్కి’ మూవీ బయ్యర్లకు ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఏర్పడింది అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు ఏర్పడ్డ ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తో పాటు ఈమూవీ ట్రైలర్ కు వచ్చిన స్పందన ఈమూవీ బయ్యర్లకు మరింత ధైర్యాన్ని కలిగిస్తోంది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.



‘సలార్’ విజయంతో ధైర్యాన్ని సంపాదించుకున్నట్లుగా బయ్యర్లు కనిపిస్తున్నప్పటికీ ఈమూవీ బయ్యర్లు లాభాల బాట పట్టాలి అంటే ఇంకా ఈసినిమాకు మరో 2వందల కోట్ల కలక్షన్స్ రావలసి ఉంది అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈసినిమాకు వస్తున్న కలక్షన్స్ అంతంతమాత్రంగా ఉంటూ ఉండటంతో భవిష్యత్ లో ప్రభాస్ సినిమాలను కొనె బయ్యర్లు ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకునే అవకాశం ఉంది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: