అయితే ఈసారి మాత్రం మత్స్యకారుల జీవిత బ్యాక్ గ్రౌండ్లో తండేల్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.ఇందులో కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా ఇందులో సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల పోస్టర్లను సైతం విడుదల చేశారు. నాగచైతన్య కెరియర్ లోనే మొదటిసారి హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా తండేల్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తూనే ఉన్నారు.
నాగచైతన్య రీసెంట్గా సముద్రం మధ్యలో సినిమా షూటింగ్ గురించి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. ఇదే స్పీడులో ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు తాజాగా తండేల్ సినిమా గ్లింప్స్ ను సైతం చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.. జనవరి 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు క్లారిటీగా రాసుకురావడం జరిగింది చిత్ర బృందం. కచ్చితంగా ఈ సినిమాతో నాగచైతన్య భారీ హిట్ అందుకుంటారని అభిమానులు సైతం చాలా ధీమాతో ఉన్నారు.. ఈమధ్య అక్కినేని హీరోలు రేసులో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్న ఈ ఏడాది నాగార్జున నా సామిరంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. అలాగె తండేల్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగచైతన్య.