2000 సంవత్సరంలో వెంకటేష్ నటించిన కామెడీ చిత్రం కలిసుందాంరా సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది.. 2001లో బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా విజేతగా నిలిచింది..2002 లో వెంకటేష్ నటించిన నువ్వు లేక నేను లేను సినిమా కూడా భార్య విజయాన్ని అందించింది.2003 లో మహేష్ నటించిన ఒక్కడు సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది.2004 లో ప్రభాస్ నటించిన వర్షం సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది.
2005లో సిద్ధార్థ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది 2006లో వెంకటేష్ నటించిన లక్ష్మి సినిమా నిలువగా 2007లో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా నిలిచింది. 2008లో రవితేజ నటించిన కృష్ణ సినిమా 2009లో అనుష్క నటించిన అరుంధతి సినిమా.. 2010లో ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా సంక్రాంతి విజేతలుగా నిలిచాయి.. అయితే ఇందులో ఎక్కువగా వెంకటేష్ నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విజేతలు ఎక్కువగా నిలిచినట్లు కనిపిస్తోంది. ఈసారి కూడా సంక్రాంతికి సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈసారి సంక్రాంతికి కూడా భారీ పోటీ నెలకొంటున్న నేపథ్యంలో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. మరి ఏ సినిమా విజయాన్ని అందిస్తుందో చూడాలి.