టాలీవుడ్‌ స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. తాజాగా వాళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలని  మణిశర్మ అన్నారు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మణిశర్మ మహేష్ బాబుకు ఒక్కడు, మురారి, పోకిరి మరియు ఖలేజా వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు .అలాగే పవన్ కల్యాణ్ కు ఖుషీ మరియు గుడుంబా శంకర్ లాంటి మ్యూజికల్ హిట్స్ ను అందించారు.కానీ ఈ ఇద్దరూ ఈ మధ్య కాలంలో మణిశర్మతో సినిమాలు చేయడం లేదు. దీనికి కారణం ఏమని ఆయనను అడిగగా మహేష్ బాబుతో తన చివరి సినిమా వరకూ పూర్తి నిబద్ధతతో పని చేశానని, అయితే తర్వాత ఏం జరిగిందో, ఎవరు తనపై ఏం ఎక్కించారో తెలియదని మణిశర్మ అన్నాడు. భవిష్యత్తులో మహేష్ తో ఏవైనా సినిమాలు చేస్తారా అని అడగ్గా.. అతడు కనీసం రెండు పెగ్గులు తాగడానికి కూడా తనను పిలవడం లేదని చెప్పారు.ఇక పవన్ కల్యాణ్ గురించి స్పందిస్తూ ఆయనతో మంచి బాండింగ్ ఉండేదని గుర్తు చేసుకున్నారు.. పవన్ కెరీర్లో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ అయిన ఖుషీ మరియు గుడుంబా శంకర్ మ్యూజిక్ ఎలా చేసారో కూడా చెప్పాడు. ఖుషీలో కేవలం చెలియ చెలియ పాటను తాను పవన్ తో కలిసి కూర్చొని మ్యూజిక్ కంపోజ్ చేశానని అలాగే గుడుంబా శంకర్ లో మాత్రం అన్ని పాటలను ఇద్దరం కలిసి చేసినట్లు గా తెలిపారు మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు.. దేవీ శ్రీకి ఒకటి, తమన్ కు ఒకటిఅలాగే తనకు ఒకటి.. ఇలా ఇస్తే ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ మ్యూజిక్ అందుతుందని మణిశర్మ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: