ఈ సందర్బంగా అమలా పాల్ తన ప్రెగ్నెన్సీని చూపిస్తూ పలు ఆసక్తికరమైన ఫోటోలను పంచుకుంది. ఇందులో తన భర్త జగత్ దేశాయ్ లోపల అమలాపాల్ తన గర్భాన్ని పట్టుకుని చూపిస్తున్నట్టు ఓ ఫోటోని, తను, తన భర్త ఆమె గర్భాన్ని పట్టుకుని చూపించినట్టు మరో ఫోటోని, సముద్ర తీరంలో తన భార్య భర్తలకు సంబంధించిన ఆఫ్ కట్ ఫోటోని షేర్ చేసింది అమలా పాల్.దీంతో సెలబ్రిటీలు, ఆమె అభిమానులు స్పందించి విషెస్ తెలియజేస్తున్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. పండంటి బిడ్డ రావాలని కోరుకుంటున్నారు. అంత బాగుండాలని విష్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు కొంటె కామెంట్లు చేస్తున్నారు. చిలిపి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అమలాపాల్ అక్టోబర్ చివరి వారంలో తన ప్రియుడు జగత్ దేశాయ్ బర్త్ డే సందర్భంగా ఆయన్ని పరిచయం చేస్తూ విషెస్ చెప్పింది. అదే సమయంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు తెలిపింది. రింగులు చూపించారు. ఆ వారం పది రోజుల్లోనే నవంబర్ 5న గ్రాండ్‌గా రెండో వివాహం చేసుకుంది అమలా పాల్.
కరెక్ట్ గా రెండు నెలలు కూడా నిండలేదు. అప్పుడే ప్రెగ్నెన్సీని ప్రకటించడంతో ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు, ఇంత ఫాస్ట్ గానా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఏదో తేడా కొడుతుందే అని, ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.అమలా పాల్.. 2014లో దర్శకుడు ఏ ఎల్ విజయ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది కూడా ప్రేమ పెళ్లినే. దాదాపు మూడేళ్ల బంధం తర్వాత 2017లో విడిపోయారు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంది అమలాపాల్. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ రెండో వివాహంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రకటించడం విశేషం.ప్రస్తుతం అమలా పాల్.. డీవిజా, లెవెల్ క్రాస్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు మలయాళంలో రూపొందుతున్నాయి. ఈ రెండు ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అమలా పాల్ భర్త జగత్.. గోవాలో లగ్జరీ విల్లాలకు మెనేజర్ గా ఉన్నట్టు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టు తెలుస్తుంది.