ఇక ఆ తర్వాత కూడా ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక భాగమతి సినిమాతో తన నట విశ్వరూపం చూపించిన అనుష్క సూపర్ హిట్ కొట్టేసింది. అయితే గత ఏడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయంలో తొందరపడకుండా మంచి కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. కాగా ఇప్పుడు ఇక మరో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు అనుష్క సిద్ధమైపోతుంది అన్నది తెలుస్తుంది.
డైరెక్టర్ క్రిష్ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం స్టోరీని రెడీ చేశారట. ఈ కథకు ప్రధాన పాత్రలో అనుష్క అయితేనే బాగుంటుందని క్రిష్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ అనుష్కతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే గతంలో క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన వేదం సినిమాలో అనుష్క ఒక కీలకమైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఆ సమయంలో వేశ్య పాత్రలో నటించిన అనుష్కకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ 14 ఏళ్లకు క్రిష్ అనుష్కతో సినిమా తీయబోతున్నాడు అంటూ ఒక టాక్ తెరమీదికి వచ్చింది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి.