కథ
11 34 అనే కథ ఓ ముగ్గురి మధ్య జరుగుతుంది. లక్ష్మణ్ (ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్)అనే మూడు పాత్రల మధ్య సాగుతుంది. ఈ ముగ్గుర్ని కిడ్పాప్ చేసి ఒకే దగ్గర కట్టి పడేస్తారు. ఏటీఎం వద్ద ఉండే కెమెరాలు హ్యాక్ చేయడం, బస్ స్టాప్‌లో వద్ద కనిపించే బ్యాగులను దొంగతనం చేయడం, ఏటీఎంలో ఇల్లీగల్‌గా డబ్బులు తీయడం ఇలాంటి చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ఉండే ఆ ముగ్గురికి ఉన్న లింక్ ఏంటి? ఈ ముగ్గురు అసలు ఆ పనులు ఎందుకు చేస్తుంటారు? ఈ ముగ్గురిని కలిపి ఆ క్రైమ్ స్టోరీ ఏంటి? ఈ కథలో 11 34 అంటే ఏంటి? చివరకు ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
కొత్త వాళ్లతో సినిమాను చేయడం సాహసమే. కొత్తవాళ్లందరూ కలిసి సినిమా చేయడం మరింత సాహసం. కొత్త వాళ్లైనా కూడా అందరూ చక్కగా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అందరూ సహజంగా కనిపిస్తుంటారు. కృష్ణగా (కృష్ణ మదుపు), ఎరిక్‌గా (గంగాధర్ రెడ్డి), హర్షగా (ఫణి భార్గవ్), లక్ష్మణ్‌గా (ఫణి శర్మ) ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. యాక్షన్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించారు.
విశ్లేషణ
క్రైమ్, రాబరి, మిస్టరీ, సస్పెన్స్ ఇలా అన్ని జానర్లను కలిసి ఓ ప్రయోగమే చేశాడు దర్శకుడు శరత్. తాను ఎంచుకున్న పాయింట్ నుంచి ఏ మాత్రం కూడా డైవర్ట్ కాకుండా తీశాడు. అనుకున్నది అనుకున్నట్టుగా తీసినట్టు కనిపిస్తుంది. మూడు పాత్రల పరిచయం, వాటి తాలుకూ ఫ్లాష్ బ్యాక్, వారి వారి నేపథ్యాలు చూపిస్తూ ఫస్ట్ హాఫ్‌ను అలా తీసుకెళ్తూ ఉంటాడు. ఇంటర్వెల్‌కు అదిరిపోయేలా ట్విస్ట్ ఉంటుంది.
సెకండాఫ్‌కు వచ్చే సరికి చిక్కుముడులన్నీ విప్పినట్టుగా ఉంటాయి. ఆ ముగ్గురి వెనుకున్నది ఎవరు? ఆ క్రైమ్స్‌ను చేయిస్తున్నది ఎవరు? దీని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ద్వితీయార్దాన్ని తీసుకెళ్తాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చే సరికి కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా ప్రేక్షకుడ్ని థ్రిల్ చేయడంలో మాత్రం 1134 సక్సెస్ అవుతుంది.
టెక్నికల్‌గా ఈ చిత్రం హై స్థాయిలో అనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలకు కెమెరా వర్క్, ఆర్ఆర్ మేజర్ అస్సెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రానికి కూడా అవే ప్రధాన బలాలు అవుతాయి. శాన్వీ మీడియా, నిర్మాత భరత్ కుమార్ పాలకుర్తి ప్యాషన్ తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.
రేటింగ్ 2.75/5