ఆంధ్రప్రదేశ్ దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ అంశంగా తెరకెక్కించిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 2019లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ సమయంలో ఈ సినిమా బాగా ఉపయోగపడింది.. ఈసారి ఎన్నికల నేపథ్యంలో మరొకసారి యాత్ర సీక్వెల్ని డైరెక్టర్ మహి వి రాఘవ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల పోస్టర్లను టీజర్లను విడుదల చేయక భారీ రెస్పాన్స్ లభించింది.


అయితే ఇప్పుడు విడుదల తేదీ పైన చిత్ర బృందం మరొకసారి క్లారిటీ ఇచ్చేసింది. ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర-2 సినిమా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని పలువురు రాజకీయ నాయకులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఎలాంటి ఇబ్బందులు పెట్టారు.అనే కథంశంతో చాలా క్లియర్ గా చూపించారు. ఇటీవలే విడుదలైన టీజర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది అంచనాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించిన వైయస్ జగన్ పాత్రలో జీవా నటించారు.

ఓదార్పు యాత్ర చేస్తానంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారని విషయాన్ని చూపించారు. ఆ అడ్డంకులను తొలగించుకొని జగన్ ఎలా అధిగమించారు తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు అనే విషయాన్ని యాత్ర-2లో చూపించారు.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలు బాలీవుడ్ నటుడైన మహేష్ మంజూరేకర్ నటించిన సోనియా గాంధీ పాత్రలో సుజనే బర్నేర్ నటించారు. అలాగే వైయస్ భారతి పాత్రల కేతిక నారాయణ నటించారు ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లో చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది.. మరి ఈసారి ఎన్నికల నేపథ్యంలో యాత్ర-2 చిత్రం ఏవిధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: