టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడి, రకరకాల అడ్డంకులు తట్టుకుని ఈ సంక్రాంతి పండుగకి జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా కనిపించనున్నారు.అయితే గుంటూరు కారం సినిమా నుంచి మహేష్ బాబువి చాలా పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇంకా అలాగే హీరోయిన్స్ తో ఉన్నవి కూడా విడుదల చేశారు. అయితే మొదట్నుంచి మహేశ్ శ్రీలీలతో ఉన్న పోస్టర్స్, సాంగ్స్ మాత్రమే ఎక్కువగా రిలీజ్ చేశారు. కానీ రెండో హీరోయిన్ మీనాక్షి చౌదరి పోస్టర్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు. అసలు ఆమె సినిమాలో ఉందా? లేక డ్రాప్ అయిందా? అనే డౌట్ లు కూడా ఈమధ్య వచ్చాయి.దీంతో మూవీ మేకర్స్.. మహేశ్, మీనాక్షి ఉన్న పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మీనాక్షి.. రాజీ పాత్రలో నటించినట్లు క్లారిటీ కూడా ఇచ్చారు మూవీ టీం వారు. అయితే ఈ పోస్టర్ లో హీరో మహేశ్ బాబు కూర్చొని ఉండగా మీనాక్షి వెనుక నిల్చొని హీరోపై చేతులు వేసి ఉంది.


 దీంతో ఈ పోస్టర్ నెట్టింటా బాగా వైరల్ గా మారింది.ఆ పోజ్ మహేశ్ బాబుకు మసాజ్ చేసినట్టు కొంతమందికి అనిపించడంతో ఈ పోస్టర్ పై సరదాగా చాలా మీమ్స్ చేశారు.మహేశ్ బాబు స్థానంలో వేరే సెలబ్రిటీలను పెట్టి మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు మీమర్స్.కమెడియన్ బ్రహ్మనందం, డైరెక్టర్ త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ ఇంకా ఛత్రపతి కాట్రాజ్ ఫొటోలను మహేశ్ ప్లేస్ లో పెట్టి క్రియేట్ చేసిన మీమ్స్ బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మీనాక్షి మీమ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని చూసిన వారు అయితే నవ్వు ఆపుకోలేకపోతున్నారు.ఇప్పుడు ఈ మీమ్స్ తోనే మీనాక్షి చౌదరి ఫుల్ ఫేమ్ సంపాదిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ఆమె అందంతో అదరగొడితే మంచి మార్కులు కొట్టేస్తుందని చెబుతున్నారు. హిట్ -2, ఖిలాడీ సినిమాల్లో నటించినా.. ఇప్పుడు ఈ మీమ్స్ తో బాగా పాపులర్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మీమ్స్ వల్ల మీనాక్షి బాగా విసిగిపోయిందట.చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి తన టీంని వీటిపై యాక్షన్ తీసుకోమని చెప్పిందట.దీంతో ఆమె టీం ఈ మీమ్స్ క్రియేట్ చేసిన పేజెస్ పై కాపీ రైట్స్ ఇష్యూ కింద చర్యలు తీసుకునే పనిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: