టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా సైంధవ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేసింది. అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా నుండి మొదటగా విడుదల చేసిన పాటలు ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అదిరిపోయే రీతిలో అలరించలేకపోయాయి.

కానీ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకుంది. ఇందులో వెంకటేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ ట్రైలర్ విడుదల తర్వాత నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ..  శ్రద్ధ శ్రీ నాథ్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

 ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను కూడా ఓపెన్ చేసింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ నగరంలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ టికెట్ లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో తమిళ నటుడు ఆర్య కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో కూడా ఈయనకు సంబంధించిన అనేక సన్నివేశాలను ఈ చిత్ర బృందం చూపించింది. వాటికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: