సాధారణంగా ఏదైనా సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందంటే కేవలం నెలరోజుల లోపే ఓటీటి లోకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒక హీరోయిన్ నటించిన సినిమా మాత్రం చాలా గ్యాప్ తీసుకొని కొన్ని నెలల తరబడి ఓటీటి లోకి ఇంకా రావడం లేదు.. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు హీరోయిన్ ఆదాశర్మ.. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రియేటివ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ది కేరళ స్టోరీ అనే ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించింది. మే 5వ తేదీన గత సంవత్సరం విడుదలై ఒక కాంట్రవర్సీని సృష్టించింది.


సినిమా ఏకంగా లాంగ్ రన్ టైంలో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.ఈ చిత్రం బడ్జెట్ విషయం కేవలం 35 కోట్లే.. థియేటర్లో విడుదలకు ముందే డీ కేరళ స్టోరీ నిరంతరం వార్తలలో నిలిచింది. కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ సుదీప్ తో సేమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఒక్కసారిగా అటు రాజకీయ ప్రకంపనలను కూడా సృష్టించింది.. పశ్చిమ బెంగాల్ తమిళనాడు అంటి ప్రాంతాలలో ఈ చిత్రాన్ని నిషేధించడం కూడా జరిగింది.


అలాంటి సమయంలోనే ఎన్నో రాష్ట్రాలు సైతం పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి బిజెపి నాయకులు ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తూ ఉండగా ప్రతిపక్షాలు మాత్రం తీవ్రమైన విమర్శలను కురిపిస్తున్నాయి.. ఇలా వివాదాలతో నిరంతరం వార్తలను నిలిచిన ది కేరళ స్టోరీ చిత్రం కలెక్షన్స్ పరంగా భారీగానే రాబట్టింది ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటి లో విడుదలే కాలేదు.. దీంతో చిత్ర బృందం యూట్యూబ్లోనైనా విడుదల చేయాలని అనుకుంటున్నా సమయంలో జి -5 ఓ టి టి ప్లాట్ ఫామ్ ఈ చిత్రాన్ని సంక్రాంతికి స్విమ్మింగ్ చేయబోతున్నట్లు తెలియజేసింది జనవరి 12న ఈ సినిమా అన్ని భాషలలో అందుబాటులోకి ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: