ఎలాగైనా తండేల్ చిత్రంతో హిట్టు కొట్టాలని తన సత్తా ఏంటో చూపించాలని చాలా కష్టపడుతున్నారు నాగచైతన్య.. ఒకవేళ నాగచైతన్య అనుకున్నట్లుగానే హిట్ పడుతుందా లేదా అనే విషయం మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నది.. నాగచైతన్య తమ్ముడు అఖిల్ కూడా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత వరకు అఖిల్ తో పోల్చుకుంటే కాస్త నాగ చైతన్యానే బెటర్ అని కూడా చెప్పవచ్చు. అఖిల్ సరైన సక్సెస్ కొట్టలేకపోతున్నారు. కానీ నాగచైతన్య మాత్రం ఆడప దడపా చిత్రాలతో సక్సెస్ లు అందుకుంటున్నారు.
ఇండస్ట్రీలో హీరోగా ముందుకెళ్లడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. నాగచైతన్య నాగార్జున తర్వాత ఇప్పుడు ముందుకెళ్తున్న హీరోలలో నాగచైతన్య పేరు మాత్రమే ఉంది. నాగచైతన్య సరైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకేరియర్ల తడాఖా, 100% లవ్, మజిలీ, లవ్ స్టోరీ ,ఏం మాయ చేసావే తదితర చిత్రాలు ఉన్నాయని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య అక్కినేని కుటుంబ భారాన్ని సైతం మొత్తం తన మీద వేసుకొని మోస్తున్నారని అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవలే తండేల్ గ్లింప్స్ విడుదల అవ్వగా భారీ రెస్పాన్స్ లభించింది.. దీంతో ఈ సినిమాతో కచ్చితంగా నాగచైతన్య భారీ విజయాన్ని అందుకుంటారని ధీమాతో అభిమానులు ఉన్నారు.. నాగార్జున కూడా నాసామిరంగ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.