ఈ సంక్రాంతికి ఆడియన్స్ ను థియేటర్స్ లో ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ఈసారి మహేష్ ని ఊర మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు. దాంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను చకచకా పూర్తి చేస్తున్నారు. నిన్ననే ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. 'గుంటూరు కారం' మూవీకి సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 

ఈ క్రమంలోనే గుంటూరు కారం సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. దాని ప్రకారం ఈ సినిమా ఫస్టాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం గుంటూరు కారం సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. లేటెస్ట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం గుంటూరు కారం ఫస్టాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేలో సాగుతుందట. ఆ ఎంటర్టైన్మెంట్ కు కావలసిన స్టఫ్ అంతా త్రివిక్రమ్ ఫస్టాఫ్ లో పక్కాగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఆ తర్వాత సెకండాఫ్ బిగినింగ్ 30 నిమిషాలు అసలు కథలోకి వెళ్తుందట. అనంతరం ఎమోషనల్ క్లైమాక్స్ తో సినిమా అంతా

మాస్ ఫెస్టివల్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఫస్టాప్ కంటే సెకండ్ హాఫ్ పెద్దదిగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా అంతా మంచి మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ తో పాటూ హై ఎమోషనల్ సీన్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద 'గుంటూరు కారం' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో పాటు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: